Train Fire: ఆ 20నిమిషాలే వందలాది ప్రాణాలను కాపాడాయి.. తోటి ప్రయాణికులను రక్షించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే రైలులోంచి ఒక్కసారిగా మంటలు రాగా దుర్గా అనే వ్యక్తి చైన్ లాగడంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగారు. దుర్గా ఆర్మీ ఉద్యోగిగా తెలుస్తోంది. By Trinath 07 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి రెప్పపాటు కాలంలో గాల్లో కలిసిపోయే ప్రాణాలు మనవి. ఏ క్షణంలోనైనా ఏమరపాటుగా ఉండకూడని రోజులివి. ప్రమాద సమయంలో ప్రతి క్షణం విలువైనది. ప్రాణాలు పోవడానికి.. ప్రాణాలు నిలుపుకోవడానికి క్షణాల వ్యవధి చాలు. ఇటివలి దేశాన్ని విషాదంలో నింపేసిన ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలోని ఓ 20నిమిషాలు వందలాది ప్రాణాలను బలిగొంటే.. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి రైలు ప్రమాద ఘటనలో వందలాది ప్రాణాలను ఆ 20నిమిషాలే కాపాడాయి. అప్రమత్తతే కాపాడింది: ఎప్పుడూ రద్దీగా ఉండే ట్రైన్ అది.. నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో గంటకు సగటున 60కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే రైలు అది. హౌరా టు సికింద్రాబాద్, సికింద్రాబాద్-హౌరా.. దాదాపు 26 గంటల ట్రిప్. దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఫలక్‌నుమా ప్రమాదానికి గురవడం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన తర్వాత రైళ్లలో ప్రయాణాలపై ఆందోళనలు నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఇప్పుడు అందరి నోటా ఈ ప్రమాదం గురించే చర్చ జరుగుతోంది. నాలుగు బోగీలు దగ్ధమైనా అందరూ క్షేమంగానే ఉండడం ఆనందాన్ని కలిగిస్తుండగా.. వందలాది ప్రాణాలను కాపాడిన ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు. ఇంతకీ ఎవరా వ్యక్తి..? ఏం చేస్తాడు..? ఎలా కాపాడాడు..? మంటలు ఆర్పుతున్న సిబ్బంది జవాన్లే కాదు.. ఆర్మీలో పనిచేసేవాళ్లంతా సేవకులే: సొంతూళ్లకు వెళ్లేవాళ్లు కొందరు..ఉద్యోగరిత్యా ప్రయాణించేవాళ్లు మరికొందరు.. కుటుంబంతో సరదాగా టూర్లకు వెళ్తున్న వాళ్లు ఇంకొందరు. అప్పటివరకు హ్యాపీగా సాగిన జర్నీపై పొగలు కమ్మేశాయి. ముందుగా S4 బోగీ నుంచి పొగలు రావడం గమనించాడు దుర్గా అనే వ్యక్తి. వెంటనే ప్రయాణికులను అలెర్ట్ చేశాడు. నిమిషం కూడా గడవకముందే ట్రైన్ ఆపేందుకు చైన్ లాగేశాడు. అందరిని కిందకి దింపేశాడు. బోగీల్లోని వాళ్లంతా 10నిమిషాలలోపే ట్రైన్ నుంచి బయటకు వచ్చేశారు. చూస్తుండగానే మంటలు మొదలయ్యాయి. ముందుగా S4 బోగీలో మొదలైన మంటలు.. తర్వాత S7 వరకు వ్యాపించాయి. బోగీలు దగ్ధమయ్యాయి..ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. పొగలు వచ్చిన వెంటనే దుర్గా చైన్ లాగి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది. వందలాది ప్రాణాలను కాపాడిన దుర్గా ఆర్మీలో ఉద్యోగి. తానొక ఆర్మీ డ్రైవర్‌నంటూ ఆర్టీవీ ఛానెల్‌తో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. దుర్గా చేసిన మంచి పని విలువ కట్టలేనిది. ఈ ప్రపంచంలో పోతే రానిది ప్రాణం మాత్రమే. అలాంటి వందలాది ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడాడు దుర్గా. మంటల్లో బోగీలు అసలేం జరిగిందంటే..? యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే రైలులోంచి ఒక్కసారిగా మంటలు రాగా దుర్గా చైన్ లాగడంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొదట రైలులో పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన రైల్వే అధికారులు బొమ్మాయిపల్లి వద్ద రైలును నిలిపివేశారు. ఇక ఈ ప్రమాదం వెనక కుట్ర దాగుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. వారం క్రితం ఒడిశా తరహా ప్రమాదం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఆ లేఖకు ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత ఘటనకు గల కారణాలు వివరిస్తామంటున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి