Nursing Home : నర్సింగ్‌ హోమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి!

ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌ హోమ్‌ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వృద్దులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటకు సురక్షితంగా రాగలిగాడు

New Update
Nursing Home : నర్సింగ్‌ హోమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి!

Fire Accident : ఉరుగ్వే (Uruguay) లోని ఓ నర్సింగ్‌ హోమ్‌ (Nursing Home) లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వృద్దులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటకు సురక్షితంగా రాగలిగాడు. దక్షిణామెరికా(South America) లోని ట్రెయింటా వై ట్రెస్‌ సిటీలోని ఆరుగదుల నర్సింగ్‌ హోమ్‌ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఆడవారు, ఇద్దరు మగవారు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రధాన ద్వారం మూసివేసి ఉండటాన్ని గుర్తించారు. లోపల గదుల్లో మంటలు వ్యాపించడంతో ఏడుగురు నివాసితులు అక్కడికక్కడే చనిపోగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అక్కడికి చేరుకునే సరికే వారు చనిపోయారు.

Also read: ముంబైను ముంచెత్తిన వర్షాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు