Blast in Madhapur PS: హైదరాబాద్ మాదాపూర్ పోలిస్ స్టేషన్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు ఒకేసారి నాలుగు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల సందర్భంగా స్థానికులు స్టేషన్ సమీపంలో బాణాసంచా కాల్చారు. ఆ నిప్పురవ్వలు ఎగిసి స్టేషన్లోని సిలిండర్లపై పడ్డాయి. పెద్ద సిలిండర్ల నుండి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపి దందా చేస్తున్న వారి నుంచి ఇటీవలే పోలీసులు సిలిండర్లు సీజ్ చేసి స్టేషన్ వెనుక భాగంలో ఉంచారు.
ఇది కూడా చదవండి: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
మంటలు భారీగా ఎగిసిపడడంతో స్టేషన్ సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ప్రమాదం సమయంలో సీఐతో పాటు ఇతర పోలీసు సిబ్బంది కూడా పోలీసు స్టేషన్ లోనే విధి నిర్వహణలో ఉన్నారు. ఎవరూ గాయపడనప్పటికి ఈ ఘటన ఆస్తినష్టం కలిగించింది.