ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు (Train accidents) ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జన్మ భూమి ఎక్స్ ప్రెస్(Janma bhumi express) లో పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.మంగళవారం ఉదయం లింగంపల్లి (Lingam Palli)నుంచి విశాఖపట్టణం (Vizag) వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
దీంతో రైలును తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో రైలును నిలిపి వేసి రైల్వే అధికారులకు ప్రయాణికులు సమాచారం అందించారు. రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో పాటు..పొగలు రావడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. రైలు ఏలూరు చేరుకున్నప్పుడే రైలు బోగీల్లో పొగ రావడం ప్రయాణికులు గుర్తించారు.
ఈ విషయం గురించి అధికారులకు సమాచారం అందించారు.దీంతో ఏలూరులో అరగంట పాటు రైలును ఏలూరు స్టేషన్లో నిలిపివేశారు. పొగలు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తరువాత ఏలూరు నుంచి విశాఖపట్టణం బయల్దేరింది. కానీ మళ్లీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకోగానే మరో రెండు బోగీల్లోనూ పొగలు రావడంతో మళ్లీ ట్రైన్ ని తాడేపల్లిగూడెంలో రైలును నిలిపివేశారు.
రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి పొగలను అదుపు చేశారు. బ్రేకులు గట్టిగా పట్టేయడం వల్ల పొగ వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. దీని గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, సమస్య పరిష్కారం అయ్యిందని వారు వివరించారు.