Fire Accident: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

AP: నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొల్లూరు పల్లి శివారు ప్రాంతంలో ఉన్న టపాకాయల తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాచ్​మెన్​ మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Breaking: ఘోర అగ్ని ప్రమాదం..ఇన్వర్టర్‌ లో మంటలు రేగి..నలుగురు ఊపిరాడక..!
New Update

Fire Accident at Nellore District: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొల్లూరు పల్లి శివారు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టపాకాయల గోడౌన్‌లో ప్రమాదం జరగగా వాచ్ మెన్ మృతి చెందాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మరో వైపు ప్రమాదం సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నెల్లూరు శివారు ప్రాంతాల్లో ఉన్న టపాకాయల తయారీ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయా...లేవా పరిశీలించాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.

Also Read : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్

#nellore-fire-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe