నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా సినీనటి రంజిత

నిత్యం రాసలీలల స్వామి, నిత్యం వివాదస్పద వార్తల్లో నిలిచి, దేశం వదిలి పారిపోయి, ఏకంగా తనకోసం కైలాస దేశమని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రకటించిన ఘనుడు ఇతడు. ఆయనేనండి నిత్యానంద స్వామీజి. గతంలో సినీనటి రంజితతో బెడ్ సీన్లతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన స్వామీజీ, ఏకంగా కైలాస అనే దేశాన్ని సృష్టించుకున్నాడు. కాగా.. ఈయన నెచ్చెలి రంజిత ఇప్పుడు ఏకంగా ఆ దేశానికి ప్రధానిగా నియమించినట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.

నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా సినీనటి రంజిత
New Update

తమిళనాడుకు చెందిన నిత్యానంద అనతికాలంలోనే వేల సంఖ్యలో భక్తులను సంపాదించుకున్నాడు. తన ఆహార్యం, అభినయంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అయితే నిత్యానంద దగ్గర పనిచేసిన కార్ డ్రైవర్ రహస్యంగా చిత్రీకరించిన ఈ స్వామి రాసలీలలు సంచలనం రేపాయి. సినీనటి రంజితతో ఆయన జరిపిన రాసలీలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని దేశ విదేశాల్లో అనేక గురుకులాలు, ఆశ్రమాలు, దేవాలయాలను స్థాపించాడు. అయితే సినీ నటి రంజిత నిత్యానందకు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. తన అశ్లీల వీడియోలు బయటపడ్డా కూడా నిత్యానంద కార్యక్రమాల్లో అగ్రపీఠం అలంకరిస్తూ ఉంటారు. ఇక రంజిత కైలాస దేశానికి ప్రధానిగా నియమితులయినట్టు తమిళనాడులో కూడా వార్త కథనాలు వచ్చాయి.

లుక్ అవుట్ నోటీసులు జారీ

అంతవరకూ బానే ఉంది. పలు దేశాల్లో ఆశ్రమాలు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు అందరూ అతన్ని మెచ్చుకున్నారు కూడా. పాపులారిటీ కూడా బానే వచ్చింది. కానీ రంజితతో రాసలీలలు, అత్యాచారం, కిడ్నాప్ వంటి కేసులు అతనిపై నమోదు కావడంతో ఆయన ప్రతిష్ట మంట కలిసింది. పలుసార్లు కోర్టుకు కూడా హాజరైన ఈ స్వామీజీ 2019 లో అకస్మాత్తుగా దేశం నుండి మాయమయ్యాడు. ఇతనిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న ఇతను ఈక్వెడార్ సమీపంలో కైలాస అనే సొంత ద్వీప దేశాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి తిరిగి లైమ్ లైట్‌ లోకి వచ్చాడు. దీన్ని ఓ ప్రత్యేక దేశంగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్ధన కూడా పంపడం విశేషం. ఇక కైలాస డాలర్ ను కూడా తీసుకొచ్చి , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ ను కూడా స్థాపించాడు. 2022 మే నెలలో తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలను ఖండిస్తూ తాను సమాధి లో ఉన్నానని, తనకేం కాలేదని ప్రకటించాడు.

కైలాస దేశానికి ప్రధానిగా రంజిత ఎన్నికైనట్టుగా వెల్లడి

పలు దేశాల్లో ఈయనకు ఆఫీస్‌లు , కార్యకలాపాలు ఉన్నట్టు ఇంటర్ పోల్ తెలిపింది. భారత్‌లో నమోదైన కేసులను తప్పించుకోడానికే ఈయన ఏకంగా దేశాన్ని స్థాపించాడని, ఈయనకున్న మూఢ భక్తులు లక్షల డాలర్లు విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా నిత్యానంద అఫీషియల్ వెబ్ సైట్‌లో నటి రంజిత ప్రధానిగా ఎన్నికైనట్టుగా పేర్కొన్నారు. రంజిత ఫొటో కింద నిత్యానందమయి స్వామీ అన్న పేరు కూడా ఉదహరించారు. పూర్తిగా హిందువుల కోసం ఏర్పాటు చేసిన దేశంగా నిత్యానంద తరుచూ తన సోషల్ మీడియా పోస్ట్‌ల్లో చెబుతూ ఉంటాడు. కాగా కైలాస దేశం తరుఫున రీసెంట్‌గా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కొంత మంది పాల్గొనడం కలకలం రేపుతోంది. ఇక త్వరలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కైలాస దేశం ప్రధానిగా రంజిత ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe