Yanamala: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో వార్..కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు..!
టీడీపీ నేత యనమల ఫ్యామిలీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తుని టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే, దివ్యకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళుతుండగా యనమల రాజేష్ ను అడ్డుకున్నారు కృష్ణుడు వర్గీయులు. దీంతో ఘర్షణ జరిగింది.
Fight In Yanamala Ramakrishnudu House: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(TDP Yanamala Ramakrishnudu) ఫ్యామిలీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బీభత్సంగా కొట్టుకున్నారు. అసలేం జరిగిందంటే?
తుని టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. దివ్యకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు యనమల రాజేష్. అయితే, ఇంతలోనే రాజేష్ వర్గాన్ని అడ్డుకున్నారు కృష్ణుడు వర్గీయులు. దీంతో యనమల కృష్ణుడు, రాజేష్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంతేకాకుండా ఇరు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు. ఈ విధంగా న్యూఇయర్ వేడుకలు రసాభాసగా మారాయి.
అయితే, గత కొన్నాళ్లుగా యనమల కృష్ణుడు, యనమల రాజేష్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి న్యూ ఇయర్ వేడుకల్లో వీరద్దరి వర్గపోరు బయటపడటంతో టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీలో కలిసి మెలసి ఉండాల్సింది పోయి..ఇలా కొట్టుకుంటు ఉన్నారేంటి అని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అందరి కలిసి పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పలు సూచనలు చేస్తున్నారు. కొందరూ మాత్రం మా తీరు మాదే అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు.