Vijayawada: విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున బస్టాండ్ లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. బస్టాండ్ బెంచీలను రాత్రంతా బ్లేడ్ బ్యాచ్ ఆక్రమించుకుంటున్నారని..యాచకులు మద్యం తాగి వచ్చి బస్టాండ్ లో ఉంటున్నారని ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు తీసుకోవడంతో ఏకంగా పోలీసులపైకి దాడికి దిగారు వందమందిపైగా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు.
Also Read: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం!
బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పొలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ దాడిలో ఆర్టీసీ సిబ్బంది సాంబయ్యకు గాయాలు అయ్యాయి. బస్టాండ్ లోని ఆర్టీసీ విచారణ సిబ్బందిపైనా దాడికి యత్నించారు. ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వై.శ్రీనివాసరావుకు సైతం గాయాలు అయ్యాయి. గంటపాటు జరిగిన ఆందోళనతో సిబ్బంది, ప్రయాణికులు భయభ్రాంతులకు గురైయ్యారు.
Also Read: టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కేశినేని చిన్ని ఆరోపణలు!
అదనపు పోలీసుల రాకతో పలువురు బ్లేడ్ బ్యాచ్, యాచకులు పరారైయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైల్వేస్టేషన్ లో యాచకులను రానివ్వకపోవడంతో యాచకులు బస్టాండ్ కు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బస్టాండ్ నుంచి పంపడాన్ని నిరసిస్తూ యాచకులు, బ్లేడ్ బ్యాచ్ ఆందోళనకు దిగారు.