Kashmir: జమ్ముకశ్మీర్‌లో భీకర కాల్పులు.. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగు జవాన్లు మరణం!

జమ్ముకశ్మీర్‌ రాజౌరి ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Poonch Terrorist Attack : ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!!
New Update

జమ్ముకశ్మీర్‌(Jammu kashmir) మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓవైపు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుండగా.. మరోవైపు కాపు కాచిన నక్కల్లా జవాన్లపై దాడులు చేస్తున్నారు ముష్కరులు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మరణించారు. అందులో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కార్డెన్‌ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను పట్టుకుంటున్నారు జవాన్లు. బాజిమాల్‌లోని ధర్మసల్ పరిసరాల్లో ఇద్దరు ఉగ్రవాదులను నిర్బంధించారు. బాజిమాల్‌ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపడంతో ఆ ప్రాంతంలో భీకర కాల్పులు జరిగాయి.


ఆస్పత్రికి తరలింపు:
ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్, మరో జవాన్ గాయపడగా.. వారిని ఉదంపూర్‌లోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కాల్పుల తర్వాత ఆర్మీ మరింత అలెర్ట్ అయ్యింది. అదనపు బలగాలను రంగంలోకి దింపింది. ఆపరేషన్‌ ముమ్మరం చేసింది.


నవంబర్ 17న రాజౌరీలోని గుల్లర్ బెహ్రోట్ పరిసర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అప్పటినుంచి ఉగ్రవాదులు జవాన్లపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండి ఉంటారని సమాచారం. ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలో 15 మంది భద్రతా సిబ్బంది, 25 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక జమ్ముకశ్మీర్‌ మొత్తం కలిపి ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల కారణంగా 81 మంది ఉగ్రవాదులు, 27 మంది భద్రతా సిబ్బంది సహా 121 మంది మరణించారు. మృతుల్లో దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో వారం రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కల్నల్ అండ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఉన్నారు. ఇక ఎక్కువగా రాజౌరి ప్రాంతంలోనే కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జంట సరిహద్దు జిల్లాలైన రాజౌరి -పూంచ్ సమీపంలోని రియాసి జిల్లాలో ఉగ్రవాద సంబంధిత ఘటనలలో అధికంగా మరణాలు నమోదయ్యాయి. అటు రాజౌరిలో ఏడుగురు ఉగ్రవాదులు, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరణించారు.

Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!

WATCH:

#jammu-encounter #jammu-kashmir-killings
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe