Hyderabad: కారును చెరువులో దూకించి.. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం! ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ తండ్రి తన ముగ్గురుపిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన అశోక్ కారులో పిల్లలను ఎక్కించుకుని వేగంగా ఇనాంగూడ చెరువులో దూకించేశాడు. స్థానికులు తాళ్ల సహాయంతో నలుగురిని కాపాడారు. By srinivas 10 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Family sucide attempt: ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కారులో ముగ్గురు పిల్లలను ఎక్కించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘోరమైన ఘటన హైదరాబాద్‌లోని ఇనాంగూడలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన అశోక్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే బుధవారం పిల్లలను తీసుకుని కారులో మార్నింగ్ వాక్ కు వెళ్లాడు. ఈక్రమంలో కారును వేగంగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఇనాంగూడ చెరువులోకి తీసుకెళ్లాడు. దీంతో వాహనం పూర్తిగా చెరువులో మునిగిపోగా.. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో నలుగురిని కాపాడారు. ఆర్థిక ఇబ్బందులతోనే అశోక్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. #ashok #bn-reddy #family-sucide-attempt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి