Kurnool : కర్నూలు జిల్లాలో సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఓ కేసులో తండ్రి కొడుకు లకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మరొకరికి జీవిత ఖైదు విధించింది. నగరంలో నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
Also Read: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్, తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులతో పాటు భార్య రుక్మిణిని.. ఆమె తల్లి రమా దేవిని అతికిరా తకంగా చంపేశాడు. రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని సైతం దారుణంగా గాయపరిచాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్పట్లో కేసు నమోదైంది.
Also Read: రుయా ఆస్పత్రిలో పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి.. తారాస్థాయికి చేరిన యూనియన్ల గొడవ
విచారణలో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. సంఘటన జరిగిన 13నెలలోనే విచారణ పూర్తి చేసి నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనా త్మకమైన తీర్పు చెప్పారు. కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభా దేవి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు.