Kurnool: కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష కర్నూలు జిల్లాలో నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లైన 14 రోజులకే అనుమానంతో భార్య, ఆమె తల్లిని చంపిన కేసులో తండ్రి కొడుకు లకు ఉరిశిక్ష విధించింది. మరొకరికి జీవిత ఖైదు వేసింది. By Jyoshna Sappogula 21 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kurnool : కర్నూలు జిల్లాలో సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఓ కేసులో తండ్రి కొడుకు లకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మరొకరికి జీవిత ఖైదు విధించింది. నగరంలో నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే? Also Read: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్, తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులతో పాటు భార్య రుక్మిణిని.. ఆమె తల్లి రమా దేవిని అతికిరా తకంగా చంపేశాడు. రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని సైతం దారుణంగా గాయపరిచాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. Also Read: రుయా ఆస్పత్రిలో పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి.. తారాస్థాయికి చేరిన యూనియన్ల గొడవ విచారణలో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. సంఘటన జరిగిన 13నెలలోనే విచారణ పూర్తి చేసి నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనా త్మకమైన తీర్పు చెప్పారు. కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభా దేవి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. #kurnool-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి