Tamil Nadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకంలో బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Uttarakhand Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Tamil Nadu Accident:అతివేగం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. గత కొన్ని ఏళ్లుగా ఎంతో మంది అతివేగంగా బండ్లను నడిపి వాళ్ళ ప్రాణాలే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముగ్గు తెస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకంలో బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి లారీని ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడిన వారిని సమీపంలో ఉన్న చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జరిగిన ప్రమాదం వల్ల చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంభందించింది మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు