Road accident: ఘోరరోడ్డు ప్రమాదం..బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది మృతి..!!

జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భావ్‌నగర్‌ వాసులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

New Update
మద్యం మత్తులో  ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు భరత్‌పూర్ ఎస్పీ మృదుల్ కచావా తెలిపారు. మరోవైపు 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు గుజరాత్‌లోని భావ్‌నగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధురకు వెళ్తోంది.

జైపూర్-ఆగ్రా జాతీయ రహదారి హంటారా వంతెన వద్ద బస్సు చెడిపోయింది. బస్సును సరిచేయడానికి డ్రైవర్ బస్సును రోడ్డుకు దగ్గరగా నిలిపాడు. అప్పుడు బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భావ్‌నగర్‌ వాసులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు లఖన్‌పూర్, నాద్‌బాయి, హలైనా, వైర్ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం 5:30 ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతులంతా భావ్‌నగర్ (గుజరాత్) వాసులుగా చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్…అసలు విషయం తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు భావ్‌నగర్‌ నుంచి మధుర వెళ్తోంది. ఉదయం భరత్‌పూర్-ఆగ్రా హైవేపై బస్సు చెడిపోయింది. డ్రైవర్, అతని సహచరుడితో సహా ఇతర ప్రయాణికులు కూడా బస్సు దిగారు. డ్రైవర్‌, అతని సహచరులు బస్సును రిపేర్ చేస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఇతర వాహనాల డ్రైవర్లు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను భరత్‌పూర్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ప్రమాదం తర్వాత మృతదేహాలు హైవేపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు