/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Disturbing-zombie-deer-disease.Scientists-are-concerned-jpg.webp)
Zombie Deer Disease: కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ...అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్ వ్యాప్తి ప్రజలకు భయాందోళనకు గురిచేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి (Covid Virus) ఇలా ప్రపంచానికి చుక్కలు చూపెడుతుంటే..ఇప్పుడు మరో వైరస్ మానవాళిని టెన్షన్ పెడుతోంది. అదే జోంబీ డీర్ వైరస్ (Zombie Deer Disease). ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైంది. ప్రజలకు సోకడం మొదలుపెడితే మాత్రం మనల్ని మనం రక్షించుకోవడం కష్టమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు (Canada Scientists) జోంబీ డీర్ డిసీజ్ అనే ప్రాణాంతక సంక్రమణ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (Chronic Wasting Disease). ఇది సోకిన ప్రతిజంతువును చంపే నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకల్లో శరవేగంగా వ్యాపిస్తోంది.
కాగా పలు నివేదికలు పేర్కొన్న వివరాల ప్రకారం..బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జోంబీ వైరస్ వ్యాప్తిచెందకుండా నిరోధించేందుకు ఒక వ్యూహాన్ని జారీ చేసింది. ఈ వ్యాధికి సంబంధించి రెండు కేసులు జనవరి చివరిలో నమోదు అయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడి అధికారులు వేగంగా కసరత్తు షురూ చేశారు. రోడ్డుపై చంపిన ప్రతి జింక, దుప్పి, ఎల్క్ లేదా కారిబోలను టెస్ట్ చేయాలని అక్కడి సర్కార్ ఆదేశం జారీ చేసింది.
జోంబీ వైరస్ మెదడు, ఇతర కణజాలంలో పేరుకుపోయి శారీరక , ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణం అవుతుంది. ఈ వైరస్ ఒక జంతువు నుంచి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా మలం, నేల ద్వారా పరోక్షంగా పర్యావరణంలో వ్యాపిస్తుంది. జంతువులు వాటి మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్ లతో కలుషితమైతే కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఒక జింకలో (Deers) ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక ఏడాది కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిన కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్