AP: మోసపోయిన రైతులకు న్యాయం చేయండి.. రైతు సంఘం నాయకుల డిమాండ్..!

ఏలూరు జిల్లాలో పోలవరం రైతులను మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మోసపోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రూ. 3.5 కోట్లు చెల్లించకుండా మోసం చేశారన్నారు.

New Update
AP: మోసపోయిన రైతులకు న్యాయం చేయండి.. రైతు సంఘం నాయకుల డిమాండ్..!

Polavaram : ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న రైతులు దళారుల చేతిలో మోసపోయిన సంగతి తెలిసిందే. రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా దాదాపు ఇవాల్సిన 3.5 కోట్ల రూపాయలు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన దళారులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు.

Also Read: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.!

కొయ్యలగూడెంలో రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం, మొక్కజొన్న బకాయి సొమ్ములు రైతులకు అందించి, మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: పిల్లలే పని మనుషులు.. గురుకులంలో వెట్టిచాకిరి చేస్తున్న విద్యార్థులు.!

అలాగే జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసిన వారికి చెల్లించాల్సిన రూ. 110 కోట్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పనులు లేక కూలీలు, కౌలు రైతులు, పేద రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారికి 21 రోజులలో వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. నెలలు గడుస్తున్న ఉపాధి హామీ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు