ప్రభాస్ అసలు హీరోనే కాదు...చురకలంటించిన పాన్ ఇండియా డైరెక్టర్..!!!

యంగ్ రెబల్ స్టార్..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల ఆదిపురుష్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ ఆశించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద రాణించలేకపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్రనిరాశ చెందారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సలార్ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యే టీచర్ కూడా రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసను కూడా గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారని కామెంట్ చేశారు. అసలు ప్రభాస్ హీరోనే కాదని చురకలంటించారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

New Update
ప్రభాస్ అసలు హీరోనే కాదు...చురకలంటించిన పాన్ ఇండియా డైరెక్టర్..!!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే బాహుబలి తప్పా ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించులేవు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నెగెటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బెటర్ అనిపించాయి.

publive-image

అయితే తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ కూడా మంచి కలెక్షన్లను సాధించినప్పటికీ మిక్ట్స్ టాక్ ను తెచ్చుకుంది. ఆదిపురుష్ లో శ్రీరాముడిగా ప్రభాస్ అంతగా ఆకట్టుకోలేదన్న టాక్ బాగానే వినిపించింది. అయినప్పటికీ తాజాగా ప్రభాస్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీపై ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన కామెంట్స్ చేశారు. సలార్ టీజర్ ను హింసను కూడా గ్లామరైస్ చేస్తున్నారంటూ నాన్సెన్ యాక్షన్ గా పేర్కొన్నారు.

డైరెక్టుగా ప్రభాస్ పేరు చెప్పకుండానే అతని యాక్టింగ్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరూ కూడా హింసాత్మకంగా జన్మించరు. పిల్లల మైండ్ ను శాంతివైపు ప్రేరేపించే విధంగా ఉండాలి. ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోనూ హింసను గ్లామరైజ్డ్ గా మార్చేస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో ఇది మాత్రమే పరిష్కారమని రాసుకొచ్చారు.

అంతేకాదు ఈ ట్వీట్ కు కొనసాగింపుగా మరొక ట్వీట్ కూడా చేశారు. సినిమాల్లో మితిమీరిన హింసను చూపించడం ద్వారా అర్థం లేని సినిమాలను ప్రమోట్ చేయడం కూడా ఒక టాలెంట్ పరిగణిస్తున్నారు. అసలు హీరోనే కానీ వ్యక్తిని గొప్ప హీరోగా ప్రమోట్ చేయడాన్ని బిగ్గెస్ట్ టాలెంట్ గా గుర్తిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఉద్దేశించి వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారు.

కాగా తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్ విడుదలయ్యింది. అందులో వైలెన్స్ ఎక్కువగా చూపించారు. ఈ విషయాన్ని సలార్ సినిమాపై డెరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ యాక్టింక్ పై వివేక్ అగ్నిహోత్రి ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు