ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర మహాజనీ అనుమానస్పద స్థితిలో తన ఫ్లాట్ లో శవమై కనిపించాడు. రవీంద్ర తలేగావ్ దభాడేలోని ఆంబిలో ఉన్న జార్బియా సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఫ్లాట్ లో గత ఎనిమిది నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కాగా రవీంద్ర మహాజనీ కుమారుడు, నటుడు గష్మీర్ మహాజనీ ముంబైలో ఉంటున్నారు. తన ఫ్లాట్ లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం అర్థరాత్రి మహాజనీ ఫ్లాట్ కు వచ్చిన పోలీసులు తలుపు పగలకొట్టి చూడటంతో మహాజనీ శవమై కనిపించారు. రెండు రోజుల క్రితమే మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా మహాజని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే రవీంద్ర మహాజని మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో రవీంద్ర మహాజని గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తాలెగావ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మహాజని గది తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో స్థానికుల ముందే పోలీసులు తలుపులు పగలగొట్టారు. ఆ తర్వాత ఇంట్లోకి రాగానే మహాజని శవమై కనిపించాడు. మృతదేహం రవీంద్ర మహాజనిగా ఇంటి యజమాని గుర్తించారు.
రెండు మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహాజని మరణవార్త అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. మరాఠీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. రవీంద్ర మహాజని మరాఠీ వినోద పరిశ్రమలోచాలా కాలం పాటు ఉన్నారు. మరాఠీ వినోద ప్రపంచంలో రవీంద్ర మహాజనీని వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. ఈ హ్యాండ్సమ్ హీరోకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పాపులారిటీలో పీక్స్‌లో ఉన్న మహాజని ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు.