Collector : జిల్లా కలెక్టర్ ఫోటో తో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట వాట్సాప్‌ మేసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ +94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మేసేజ్ లను అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు.

New Update
Collector : జిల్లా కలెక్టర్ ఫోటో తో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు..!

Rajanna siri silla jilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట వాట్సాప్ లో మోసపూరిత మేసేజ్ లు జిల్లాలో హల్ చల్ చేస్తున్నాయి. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలను, +94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మేసేజ్ లను జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

Also Read: ఈ జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు.. 1666 మంది ట్రబుల్ మాంగర్స్.. 150 కేసులు: SP

జిల్లా కలెక్టర్ పేరిట మోసపూరిత మేసేజ్ లు, పలు తప్పుడు కథనాలు, వాట్సాప్, ఫేస్ బుక్ మరియు వివిధ సోషల్ మీడియాల్లో ప్రచారం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. ఇలాంటి మేసేజ్ లు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు