కూలిన ఎయిర్ పోర్టు సీలింగ్.... బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం...!

అండమాన్‌లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినెల్ భవనంలో సీలింగ్‌లో ఓ భాగం కూలి పోయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

కూలిన ఎయిర్ పోర్టు సీలింగ్.... బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం...!
New Update

అండమాన్‌లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టర్మినెల్ భవనంలో సీలింగ్‌లో ఓ భాగం కూలి పోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

False ceiling of new Veer Savarkar International Airport in Andaman collapses

'న్యూ ఇండియా'లో దయనీయ స్థితిలో వున్న ప్రభుత్వ వ్యవహారాలకు పన్ను చెల్లించే పౌరులు మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి ఈ రోజుల్లో దేనికైనా ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. అది అసంపూర్తిగా లేదా నాణ్యత లేని మౌలిక సదుపాయాలైనప్పటికీ దానికి ప్రారంభోత్సవం చేస్తారంటూ విరుచుకుపడ్డారు.

ఇక జైరాం రమేశ్ వ్యాఖ్యలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విమానాశ్రయంలో సీసీ టీవీ కెమెరాలను ఇన్ స్టాల్ చేసేందుకు గాను ప్యానెల్స్ ను లూజ్ చేసినట్టు తెలిపారు. సీసీ టీవీలు ఇన్ స్టాల్ చేశాక మళ్లీ వాటిని ప్యానెల్స్ ను బిగించామని చెప్పారు. టర్మినెల్ బిల్డింగ్ బయట వున్న సీలింగ్ డ్యామెజ్ అయినట్టు చెప్పారు.

ఇటీవల బలమైన గాలుల వల్ల సీలింగ్ ఊగిసలాడుతూ కనిపించిందన్నారు. సీసీ టీవీ ఇన్ స్టాలేషన్ పనులు పూర్తయ్యాక సీలింగ్ ను పునరుద్దరించామని వెల్లడించారు. ఈసారి ఏమీ లేని విషయాల్లో సంచ‌ల‌నాల కోసం పాకులాడే ముందు కనీసం వివ‌ర‌ణ కోరండ‌ని జైరాం ర‌మేష్‌ కు కేంద్ర మంత్రి చుర‌క‌లు అంటించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe