Crime News: పోలీస్ యూనిఫాంతో పెళ్లి చూపులకు.. నకిలీ ఎస్ఐ ఎలా దొరికిపోయిందంటే..?

నకిలీ ఎస్సై గా చెలామణి అవుతున్న నార్కట్ పల్లికి చెందిన యువతి మాలవికను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫాంలోనే వెళ్లింది. దీంతో అబ్బాయి తరపు వాళ్ళు పై అధికారులను సంప్రదించగా అసలు మోసం బయటపడింది.

New Update
Crime News: పోలీస్ యూనిఫాంతో పెళ్లి చూపులకు.. నకిలీ ఎస్ఐ ఎలా దొరికిపోయిందంటే..?

Secunderabad: సికింద్రాబాద్..RPF ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది. నార్కట్ పల్లికి చెందిన యువతి మాలవిక గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా చెలామణి అవుతోంది. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది ఈ యువతి. 2018లో అర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసింది. అయితే, కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు. కానీ, నార్కట్ పల్లి గ్రామంలో ఎస్సైగా చెలామణి అవుతోంది.

publive-image

Also Read: అహంకారంగా అపర్ణ.. కొడుకు కాపురాన్ని నిలబెడుతుందా.. కావ్య పరిస్థితి ఏంటి?

అర్ పి ఎఫ్ ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐడి కార్డులు తయారు చేసుకుంది. శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది మాళవిక. అంతేకాదు పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫాంలోనే వెళ్లింది. దీంతో, పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పై అధికారులను సంప్రదించగా అసలు మోసం బయటపడింది.

publive-image

నల్గొండలో మాళవికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు భాద పడుతుండడంతోనే ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపారు. ఇన్‌ స్టా లో సైతం అర్ పి ఎఫ్ యూనిఫాంలో మాళవిక రీల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఫొటోలను చూస్తే పలు కాలేజ్ కార్యక్రమాలకు ఉపన్యాసాలకు కూడా వెళ్లేదని అర్థమవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు