Nandyal: నంద్యాల జిల్లా జిజిహెచ్ లో నకిలీ డాక్టర్ హల్ చల్ .!

నంద్యాల జిల్లా జిజిహెచ్ లో నకిలీ డాక్టర్ హల్ చల్ చేశాడు. కోకల ప్రసాద్ అనే వ్యక్తి మద్యంలో మత్తులో మహిళా వార్డులో ప్రవేశించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటించాడు. రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.

New Update
Nandyal: నంద్యాల జిల్లా జిజిహెచ్ లో నకిలీ డాక్టర్ హల్ చల్ .!

Nandyal:  తప్ప తాగి మహిళా మెడికల్ వార్డులో ప్రవేశించి ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటించాడు. ముగ్గురు రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని చితకబాదారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న నంద్యాల రెండో పట్టణ సిఐ ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నకిలీ డాక్టర్ ను స్టేషన్ కు తరలించాడు. అసలేం జరిగిందంటే.?

Also Read: అభిమానులు నన్ను అలా పిలవడం నచ్చలేదు.. నయన్ షాకింగ్ కామెంట్స్

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కోకల ప్రసాద్ హల్ చల్ చేశాడు. మహిళా మెడికల్ వార్డులో ప్రవేశించి తాను డాక్టర్ ను అంటూ పేషంట్స్ పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అతడిని బాగా చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: హైదరాబాద్ లో దారుణం.. అప్పు తీర్చలేదని భార్యాభర్తలను ఏం చేశారంటే.?

ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. నాలుగు రోజులు జైలు శిక్ష విధించారు. నిందితుడు సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. ఘటనపై స్పందించిన పోలీసులు తాగి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు