Patanjali: హీరో టు జీరో.. పతంజలి పతనానికి కారణాలు ఇవే!

మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏం అవుతుంది? జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే ఏం జరుగుతుంది? బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాందేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.

New Update
Patanjali:  హీరో టు జీరో.. పతంజలి పతనానికి కారణాలు ఇవే!

Patanjali: మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏం అవుతుంది? జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టులో చివాట్లు తీనాల్సి వస్తుంది. అప్పటివరకు ఆకాశాన్ని తాకి ఉన్న వ్యాపారం ఒక్కసారిగా పాతాళానికి కుప్పకూలుతుంది. సంపాదించిన పేరు, పరువు, ప్రతిష్ట అన్ని నాశనమవుతాయి. బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం రాందేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.

Also Read: Hemorrhoids: పైల్స్ ఎందుకు వస్తాయి..? మాంసం తినడమే కారణమా..? ఈ టిప్స్ పాటిస్తే పైల్స్ దూరం..!

ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే FMCG రంగంలో ప్రకంపనలు సృష్టించిన స్వదేశీ కంపెనీ పతంజలి. 2016- 2017 మధ్య కాలంలో 10 వేల కోట్ల రూపాయల వరకు లాభాలు గడించిన కంపెనీ ఇది. పతంజలి దెబ్బకు బడా కంపెనీలు భయపడ్డాయి. అప్పటివరకు మార్కెట్‌లో కొనసాగిన పలు కంపెనీల గుత్తాధిపత్యం అంతం కాబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే నాటి పతంజలి పరిస్థితి వేరు.. నేటి పతంజలి దుస్థితి వేరు. పదే పదే తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థను సుప్రీంకోర్టు అనేకసార్లు చివాట్లు పెట్టింది.

Patanjali

పతంజలి (Patanjali) 2006లో ప్రారంభమైంది. 2006లో సహాధ్యాయి బాలకృష్ణతో కలిసి బాబా రాందేవ్‌ (Ramdev Baba)  ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. 2015వరకు ఈ కంపెనీ దశ మారలేదు. 2015లో ఫ్యూచర్ గ్రూప్‌తో టైఅప్ అయినప్పటి నుంచి పతంజలి వ్యాపారం మలుపు తిరిగింది. పతంజలి వస్తువులు 250 నగరాలకు చేరుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ భారీ లాభాలను అర్జించింది పతంజలి. 2011 - 2017 వరకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా కంపెనీకి చెందిన కొన్ని స్టార్ ప్రొడక్ట్స్ వల్లే జరిగింది. ఉదాహరణకు టూత్‌పేస్ట్, సబ్బు, పిండి లాంటి కొన్ని అవసరాలు ఎల్లప్పుడూ అవసరమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోని పతంజలి సంబంధిత ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లోకి వదిలింది. అయితే 2018 తర్వాత పతంజలి పతనం ప్రారంభమైంది.

publive-image
పతంజలి గ్రూపు ఆదాయం ఫెయిర్‌ నెస్‌ క్రీం, నూడుల్స్‌, వెజిటబుల్‌ ఆయిల్‌ లాంటి ఉత్పత్తుల ద్వారా వస్తున్న రోజుల్లో రాందేవ్‌ బాబా అన్ని రంగాల్లో వేలు పెట్టడం ప్రారంభించారు. అది కరోనా సమయంలో అదుపు తప్పింది. తానేం చెప్పినా అందరూ నమ్ముతారులే అని భావించిన రాందేవ్‌ బాబా.. కరోనిల్‌ అంటూ.. ఇదే కరోనాకు మందు అంటూ రోగంతో వ్యాపారం చేయాలని చూశారు. ఎలాంటి క్లీనికల్‌ ట్రయల్స్‌ లేకుండా ఒక రోగానికి ఇదే మందు అని చెప్పడం వివాదాస్పమైంది. ఇది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆగ్రహానికి కారణమైంది. పతంజలి చేసిన మరో పెద్ద తప్పు కూడా ఉంది. తమకు నైపుణ్యం లేని పరిశ్రమలలో తక్కువ పరిశోధనలతో మార్కెట్‌లోకి వచ్చింది. ఆయుర్వేదం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించిన సంస్థ, క్రమంగా దుస్తులు నుంచి టెలికమ్యూనికేషన్ పరిశ్రమ వరకు ప్రతిదానిలోను అడుగుపెట్టింది. దీని కారణంగా అతను అప్పటికే పట్టు ఉన్న చోట కూడా బలహీనంగా మారింది.

Patanjali

అటు కంపెనీ సరఫరా గొలుసు కూడా చాలా బలహీనంగా మారింది. ఇది ఉత్పత్తులను సమయానికి రిటైలర్‌కు పంపిణీ చేయలేకపోయింది. అత్యధిక డిమాండ్‌లో ఉన్న పతంజలి స్టార్ ఉత్పత్తులను తగినంత పరిమాణంలో సరఫరా చేయలేకపోయింది. షాపులకు డెలివరీ చేయడం చాలా ఆలస్యం చేసింది. దీని కారణంగా పతంజలి ప్రతి ఫ్రంట్‌లో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. ఇది ఓవరల్‌గా పతంజలి బ్రాండ్‌ను దెబ్బకొట్టింది. ఒక కంపెనీగా పతంజలి నష్టాలను చవిచూడడమే కాకుండా రాందేవ్‌ బాబా ఏరికోరి తెచ్చుకున్న వివాదాలు కంపెనీ వృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

Also Read: Gestational diabetes: ప్రెగ్నెన్సీ టైం లో డయాబెటిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే!

Advertisment
తాజా కథనాలు