Alert: ఈ రెండు మూడు రోజులూ విపరీతమైన చలి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

వచ్చే రెండు మూడు రోజులూ తెలంగాణలో చలి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ రోజుల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగి అనంతరం సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని పేర్కొన్నది.

New Update
Alert: ఈ రెండు మూడు రోజులూ విపరీతమైన చలి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

Weather Update: వచ్చే రెండు మూడు రోజులూ తెలంగాణలో చలి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ రోజుల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగి అనంతరం సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని పేర్కొన్నది. అయితే, డిసెంబర్ చివరి వారం నాటికి మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: బంగారం అక్రమ తరలింపుపై షాకింగ్ నిజాలు.. మూడేళ్లలో ఇప్పుడే అత్యధికం

రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకూ తక్కువ నమోదవుతుందని తెలిపింది. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా; మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీలు, అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 18 డిగ్రీలు నమోదవుతోంది. పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఊష్ణోగ్రతలు ఉంటున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు