Relationship Problems : వివాహం(Marriage) అనేది పవిత్రమైన బంధం. ఈ బంధంలోకి అడుగుపెట్టిన మొదట్లో బానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఈ బంధం బలహీనంగా మారుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చిచ్చు రేగేలా మారుతుంది. దీంతో వివాహేతర సంబంధాలు(Illegal Affair) పెరుగుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. మార్పు లేని జీవితం కొంతమందికి బోరింగ్‌గా ఉంటుంది. ప్రతిరోజు జీవిత భాగస్వామి(Life Partner) తో మార్పులేని శృంగారం, అదే ఇల్లు, అదే పని ఇవన్నీ కూడా బోరింగ్‌గా అనిపించి చాలా మంది మరొకరితో అక్రమ సంబంధాన్ని కోరుకుంటారు.
కొన్ని వివాహ బంధం బలవంతంగా మొదలవుతుంది. డబ్బు కారణంగా, కుటుంబ ఒత్తిళ్ళ కారణంగా. దీంతో ఇద్దరిలోనూ ప్రేమ కరువై వారు మరొకరి వైపు చూపు సారిస్తారు. దీని వల్ల ఇద్దరి మధ్య మరొకరు వస్తారు.కొంత మందికి తమ ఇష్టానికి అనుకూలమైన పార్టనర్ లేకపోవడం వల్ల కూడా వివాహ బంధంలో చికాకులకి కారణమవుతుంది. పార్టనర్స్‌లో నచ్చని అలవాట్లు, ఇంట్లో అత్త మామ వ్యవహార శైలి కారణంగా కూడా ఉన్న బంధంలో చికాకు కారణంగా బంధంలో గొడవలు మొదలై వారి గాలి మరోవైపు మళ్ళుతుంది.
పెళ్ళికి ముందు ఒకరితో ఏదైనా కారణంతో బ్రేకప్ చేసుకున్నవారు పెళ్ళి తర్వాత తమ తప్పు తెలుసుకుని అదే రిలేషన్(Relation) ని కావాలనుకుంటారు. దీంతో ఎంత బాగున్నా వివాహబంధంలో గొడవలు మొదలవుతాయి.భార్యాభర్తలిద్దరూ లైంగికంగా ఆనందంగా గడపకపోవడం, పని ఒత్తిడి, ఇద్దరు కలిసి సమయం గడపక పోవడం వంటి కారణాల వల్ల కూడా వివాహ సంబంధంలో బీటలు వారే అవకాశం ఉంది.భర్త కానీ, భార్య కానీ వారి బంధం విషయంలో ఏదైనా మోసం జరిగిందని భావిస్తే దీనికి ప్రతీకారంగా వారు మరో రిలేషన్‌ని కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, దీనిని కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.మార్పు లేని జీవితం కొంతమందికి బోరింగ్‌గా ఉంటుంది. ప్రతిరోజు జీవిత భాగస్వామితో మార్పులేని శృంగారం, అదే ఇల్లు, అదే పని ఇవన్నీ కూడా బోరింగ్‌గా అనిపించి చాలా మంది మరొకరితో అక్రమ సంబంధాన్ని కోరుకుంటారు.
Also Read : ప్రజాగళం సభలో జనసైనికుల ఆందోళన..!