Andhra Pradesh: పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత.

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల నియామకాలు, మార్పిడిలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు కీలకశాఖలలో ఐఎస్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఆల్రెడీ పదవుల్లో ఉన్న ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
Andhra Pradesh: పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత.

AP Government: గవర్నర్ కార్యదర్శి గా ఐఏఎస్ హరిజవహర్ లాల్ , ఆర్టీసీ ఎండి గా ద్వారక తిరుమల రావు కు అదనపు బాధ్యతలను జారీచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వయోజన విద్యా డైరెక్టర్ నిధి మీనా కు ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ బి.శ్రీనివాసరావు కు పాఠశాల విద్యా మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ గా..పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.యువరాజ్ కు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా పూర్తి అదనపు బాధ్యతలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిరకు ఆ శాఖకు కార్యదర్శిగా పనిచేసిన గోపాల కృష్ణ ద్వివేదినీ రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పశుసంవర్థక శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్ కు ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరెటీవ్ ఫెడరేషన్ ఎండీ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

Also Read:Gujarath: చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యమా..వ్యాన్‌లో నుంచి పడిపోయిన విద్యార్ధులు

Advertisment
తాజా కథనాలు