/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-95-4.jpg)
Extra Jabardasth: బుల్లితెర పై దాదాపు 11 ఏళ్లుగా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతూ అలరిస్తున్న కామెడీ షోలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్. తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోలుగా సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఈ షో వినోదాన్ని పంచడంతో పాటు.. ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ను బుల్లితెరకు పరిచయం చేసింది. జబర్దస్త్ ద్వారా పాపులరైన కొంత మంది కమెడియన్స్ నేడు హీరోలుగా రాణిస్తున్నారు. మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్స్ గా అవకాశాలు పొందుతున్నారు.
ఇక పై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్' ఉండదు
ఇది ఇలా ఉంటే.. ఈ షోకు సంబంధించిన ఓ న్యూస్ జబర్దస్త్ ఫ్యాన్స్ కు షాకిచ్చించింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇక పై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్' షో ఉండదని. కేవలం 'జబర్దస్త్' మాత్రమే ప్రసారం అవుతుందని తెలిపారు. దీంతో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్' కమెడియన్స్ రామ్ ప్రసాద్, రాకేష్, నరేష్, యాంకర్ రష్మీ ఎమోషనల్ అయ్యారు.
అయితే జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన మొదట్లో జబర్దస్త్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత షో బాగా సక్సెస్ కావడం, కంటెస్టెంట్ల పెరగడంతో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను' ప్రారంభించారు. ప్రతీ శుక్రవారం ప్రేక్షకులను కడుపుబ్బా కడుపుబ్బా నవ్వించే 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' రాదని తెలియడంతో ఫ్యాన్స్ భాదను వ్యక్తం చేస్తున్నారు .
Also Read: Pushpa 2: ”సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!