Alert: విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది

Alert: విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు
New Update

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది

హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి నగరంలోని బేగంపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీరు నీలవడంతో ముంపు ప్రాతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరోవైపు నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. సాధార‌ణంగా జులై 20 నాటికి హైద‌రాబాద్‌లో స‌గ‌టున 101.2 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదవుతుంది. కానీ ఈ ఏడాది సాధార‌ణం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 122.4 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. వారం చివ‌రి వ‌ర‌కు వ‌ర్షాలు కురిసే అవ‌కాశముందని, నగర వాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

కాగా గత 4 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. మరి కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ నిలిచిపోయింది. దీంతోపాటు భారీ వరదలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గోదావరీ నదీ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో సమీప ప్రాంత వాసులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు ముందస్తు చర్యలో భాగంగా లంక గ్రామాలను కాళీ చేయిస్తున్నారు.

#telangana #govt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe