TS Lawcet 2024: తెలంగాణలో లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ..పరీక్ష తేదీ ఇదే.! By Bhoomi 15 Apr 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TS Lawcet 2024: తెలంగాణలోని న్యాయ కాలేజీల్లో ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో మరో 10రోజులపాటు గడువును పొడిగించారు. దీంతో ఎలాంటి ఆసల్య రసుము లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ తెలిపారు. 3ఏండ్లు, ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరేందుకు జూన్ 3వ తేదీ ప్రవేశపరీక్ష జరగనుంది. లాసెట్ కు దరఖాస్తు రుసుము రూ. 900ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రూ. 600, పీజీఎల్ సెట్ కు రూ. 1,100ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 900చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన..! #ts-lawcet-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి