ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌.. ఆస్ట్రేలియా స్కోర్‌ 166/7

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తక్కువగా ఉండటంతో దాటికి ఆడటానికి ప్రయత్నించిన ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.

New Update
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌.. ఆస్ట్రేలియా స్కోర్‌ 166/7

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్‌కు అనుకున్నర వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తక్కువగా ఉండటంతో దాటికి ఆడటానికి ప్రయత్నించిన ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చివరికి నిర్ణిత 23 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది ఆసిస్.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి భారీ స్కోర్‌ చేస్తుందని అనుకున్నారంతా. కానీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోని ఆస్ట్రేలియా ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. తర్వాత ఆసిస్‌ బ్యాటర్లు బ్యాక్‌ టూ బ్యాక్‌ వికెట్లో కోల్పోయింది. ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా అంతకు ముందు భారత్‌-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మధ్య మధ్యలో వరుణుడు కాస్త శాంతించినా గ్రౌండ్‌ సిబ్బంది పిచ్‌ను ఆరబెట్టే సమయానికి మళ్లీ వర్షం పడటంతో పిచ్‌ మొత్తం తడిసింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు.

మ్యాచ్‌ రద్దు కావడంతో టఫ్‌ టీమ్‌ల మధ్య ఫైట్‌ హోరా హోరీగా సాగుతుందని, వరల్డ్ కప్‌ అసలు సమరానికి ముందు ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌ను చూద్దామని ఎంతో ఆశతో స్టేడియానికి వచ్చిన క్రికెట్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. అంతే కాకుండా ఇంగ్లండ్‌ బౌలర్లను, బ్యాటర్లను ఎదుర్కొని వారి సత్తా ఎంటో తెలుసుకుందామనుకున్న భారత క్రికెటర్లు సైతం నిరాశకు గురయ్యారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు