Air Gun:పేలిన ఎయిర్ గన్.. యువకుడి వీపులోకి దూసుకెళ్లిన తూటా!

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి.. సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్ పేలింది. ఈ ఘటనలో బోధనపు రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో తూటా దూసుకెళ్లింది.

Air Gun:పేలిన ఎయిర్ గన్.. యువకుడి వీపులోకి దూసుకెళ్లిన తూటా!
New Update

Air Gun: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి.. సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్ పేలింది. ఈ ఘటనలో బోధనపు రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో తూటా దూసుకెళ్లింది. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

లింగంపేట పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్.. స్నేహితుడైన రాజుకు వ్యవసాయ క్షేత్ర యజమానికి చెందిన ఎయిర్ గన్ పనితీరును వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పేలిన ఎయిర్ గన్ తో రాజు వీపు భాగంలో తీవ్ర గాయమైంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి