Dravidians and sanathana dharmics: బ్రాహ్మణుల గుత్తాధిపత్యంపై పోరాటం చేసిన గడ్డ తమిళనాడు(Tamilnadu). దళితుల(Dalits) పక్షన నిలబడి ‘ఆత్మగౌరవ’ ఉద్యమాన్ని ప్రారంభించిన తమిళులు ఈనాటికి సనాతన ధర్మ(Sanathana dharma) సిద్ధాంతాలపై తమ గళం వినిపిస్తూనే ఉన్నాయి. కుల నిర్మూలన జరగాలని.. సనాతన అంటే సంస్కృతంలో 'శాశ్వతం' అని అర్థం అని.. ఈ వివిక్ష, అంటరానితనం సనాతన ధర్మం మూలసూత్రాలంటూ బ్రాహ్మణవాదంపై ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. ద్రవిడ(dravida) ఉద్యమాల నుంచి జీవం పోసుకొని పుట్టిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పెరియార్(periyar) అడుగులను ఈనాటికి అనుసరిస్తూనే ఉంది. అందుకు తాజాగా డీఎంకే మంత్రి, తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి(Udhayanidhi) చేసిన వ్యాఖ్యలే బెస్ట్ ఎగ్జాంపూల్. సనాతన ధర్మంతో సామాజిక న్యాయం జరగదని, ఇది మలేరియా, డెంగీ లాంటిదని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అటు రాజకీయ రచ్చతో పాటు హిందూ మతాల పెద్దలు సైతం ఉదయనిధిపై మండిపడుతున్నారు. అసలు ఉదయనిధి ఇలా ఎందుకు వ్యాఖ్యానించారు. తమిళనాడులో కులాల వారీ వ్యవస్థల నిర్మూలనకు కంకణం కుట్టుకున్నామని ఆయన ఎందుకు చెబుతున్నారు? అసలేంటి ద్రవిడ వర్సెస్ సనాతన వైరం?
ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్దాం:
అది 1924.. కేరళలోని ట్రావెన్‌కోర్(travancore) రాజు ఆలయానికి వెళ్లే రహదారిపై దళితుల ప్రవేశాన్ని నిషేధించిన సంవత్సరం. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రోజులవి. నిజానికి వేల సంవత్సరాలుగా అంటరానివారిగా వివక్షను ఎదుర్కొంటున్న దళితులు తమ ఆత్మగౌరవం కోసం ఉద్యమాల బాట పట్టాలని కంకణం కట్టుకున్న కాలమది. అప్పటివరకు కులంహకురులపై బహిరంగంగా యుద్ధానికి దిగన దళితులు.. వారిని నేరుగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇది ఆ రాజుకు కోపం తెప్పించింది. నిరసనతో పోరాడుతున్న స్థానిక ప్రజలను రాజు ఆదేశాలతో అరెస్టు చేశారు . దీంతో ఉద్యమం నాయకత్వరహితంగా మారింది. దళితుల హక్కుల కోసం పోరాడి.. నెలల తరబడి జైలు జీవితం గడిపిన పెరియార్ ఉద్యమంలోకి దూసుకొచ్చారు. నిజానికి అంతకముందే.. అంటే 1920లో అధికారంలోనికి వచ్చిన బ్రహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీ పలు సంస్కరణలను చేపట్టింది. అయినా అది దళితులలోనే పైవర్గాల వారికే ఎక్కువ ప్రాతినిధ్యం వహించడం వల్ల తక్కువ సమయంలోనే సామాన్యులకు దూరమైంది.
పెరియార్ రిగిల్చిన స్పూర్తి:
ఈ.వీ పెరియార్ రామస్వామి ద్రవిడ ఉద్యామాన్ని ముందుండి నడిపించాడు. తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిస్థితులపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి పెరియార్. ఆయన భావజాలాన్నే డీఎంకే, అన్నాడీఎంకే పునికి పుచ్చుకున్నాయి. డీఎంకేతో పోల్చితే అన్నాడిఎంకే ఈ విషయంలో కాస్త తక్కువే అయినా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అన్నాడీఎంకే తమిళుల పక్షాన నిలపడింది. అందుకే తమిళ రాజకీయాలు పెరియార్ ప్రస్తావన లేకుండా అసలు ఉండవు. ముఖ్యంగా కమ్యూనిస్టులు, దళిత ఉద్యమ భావజాలం ఉన్నవారు, తమిళ జాతీయవాదులు, హేతువాదులు, స్త్రీ వాదులు ఆయననే మార్గదర్శిగా భావిస్తారు. పెరియార్ ఓ హేతువాది, నాస్తికుడు, అణగారిన వర్గాల మద్దతుదారుడు. ఈ కారణంగా తన రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాడు.
హిందూ అయినా.. హిందీ అయినా వ్యతిరేకమే:
నిజానికి హిందీ భాషను అందరికంటే ఎక్కువగా వ్యతిరేకించేది తమిళులే. ఇటు సనాతన ధర్మంలోని కులాల నిర్మూలపై పోరాటం చేసింది కూడా అక్కడివారి. నాటి ఉద్యమంలో తెలుగు, కన్నడ ప్రజల పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా ఈ పోరాట ప్రభావాలు కనపడవు. తమిళనాడులో మాత్రం ఈనాటికి బ్రాహ్మణవాదంపై డీఎంకే నేతలు, ఇతర హేతువాదులు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.
అంత్యక్రియలు కూడా ద్రవిడ సిద్ధాంతంలోనే:
డిసెంబర్ 5,2016న నాటి తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత(jaya lalitha) లాస్ట్ జర్ని జరిగింది. దక్షిణాది రాష్ట్రానికి చెందిన అత్యంత శక్తిమంతమైన మహిళ అంత్యక్రియలపై దేశమే కాదు, విదేశీయుల దృష్టి కూడా పడింది. అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, కన్నీళ్లతో పాటు, బాధాకరమైన కళ్ల నుంచి పలు ప్రశ్నలు కూడా వచ్చాయి. 'హిందూ' పేరున్న సీఎంను ఎందుకు సమాధి చేస్తున్నారని ద్రవిడ ఉద్యమ చరిత్ర తెలియని వారు ప్రశ్నించారు. జయలలిత అంత్యక్రియలు జరిగినప్పుడు, ఆమెను ఖననం చేసి, ఆపై ఆమె సమాధిని నిర్మించారు. అటు 2018లో.. జయలలితకు అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థియిన కరుణానిధి మరణం తర్వాత కూడా ఆయన్ను దహనం చేయలేదు. సమాధే చేశారు. జయలలిత, కరుణానిధి(karuna nidhi) ఇద్దరూ ద్రవిడ ఉద్యమంతో ముడిపడి ఉన్నవారే. ద్రవిడ ఉద్యమం హిందూ మతంలోని బ్రాహ్మణ సంప్రదాయాన్ని , సంస్కృతిని, ఆచారాన్ని విశ్వసించదు. బ్రాహ్మణవాదంపై వ్యతిరేకతకు చిహ్నంగా.. ద్రవిడ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులు దహన సంస్కారాలకు బదులుగా ఖననం చేసే పద్ధతిని అవలంభిస్తారు. ఇలా పుట్టుక నుంచి చావు వరకు బ్రాహ్మణవాదం, సనాతన ధర్మ సూత్రలకు చాలా మంది తమిళులు వ్యతిరేకులు!
ALSO READ: పది కోట్లు అక్కర్లేదు..పది రూపాయల దువ్వెన చాలు!
ALSO READ: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!!