Anger: కోపం ఎన్ని అనర్థాలకు కారణమో తెలుసుకోండి.. సంచలన అధ్యయనం!

మద్యానికి, సిగరెట్లకు, డ్రగ్స్‌కు బానిసలైన వారికి కోపం ఎక్కువగా వస్తుంది. కోపం గుండెకు హాని కలిగించడమే కాకుండా చిరాకు, అలసట, నిద్ర లేకపోవడం, నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కోపాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Anger: కోపం ఎన్ని అనర్థాలకు కారణమో తెలుసుకోండి.. సంచలన అధ్యయనం!

Anger: ఒక సమస్యపై కోపం రావటం సహజం. చిన్న చిన్న విషయాలకు కొందరి కోపం వస్తుంది. మరికొందరైతే మరింత కోపం చూపిస్తారు. మీరు ఎవరితోనైనా అరుస్తుంటే.. రక్త నాళాలు ఇస్కీమియాకు ప్రతిస్పందిస్తాయి. రక్తనాళాల పనితీరుకు కోపం మంచిదికాదు. కోపంతో స్వంత పరిస్థితిని పాడు చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కోపం హృదయానికి మంచికి కాదని విషయం చాలామందికి తెలియదు. ఇది జీవిత నాశనానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదని అంటున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు కార్డియోవాస్కులర్ హోమియోస్టాసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కోపంతో ఎలాంటి అనర్థాలు ఉన్నాయో దాని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నష్టం ఎలా జరుగుతుంది?

మనకు ఎక్కువగా కోపం వస్తే శరీరంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. దీనివల్ల బీపీ, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాదు రక్తనాళాల లోపలి పొరకు చాలా నష్టం వాటిల్లుతుంది. రక్త ప్రసరణలో ప్లేట్‌లెట్స్, లిపిడ్‌లు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది తరువాత గుండెపోటుకు కారణమవుతుంది. కోపం గుండెకు హాని కలిగించడమే కాకుండా చిరాకు, అలసట, భావోద్వేగ నష్టం, నిద్ర లేకపోవడం, నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యానికి, సిగరెట్లకు, డ్రగ్స్‌కు బానిసలైన వారికి చాలా కోపం వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుంద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో అధ్యయన నిపుణులు చెబుతున్నారు.

కోపాన్ని అదుపు చేయడం ఎలా:

కోపం చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి.
యోగా, ధ్యానం సహాయం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర, మంచి ఆహారం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వలన కోపాన్ని కంట్రోల్‌ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తక్కువ కేలరీల ఫుడ్‌ ఐటెమ్స్‌ కోసం చూస్తున్నారా? మెను ఇదిగో!

Advertisment
Advertisment
తాజా కథనాలు