Layoffs: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..! ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్స్ ల్ సర్వీస్ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యింది. By Bhoomi 08 Apr 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Layoffs: ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఐటీ కంపెనీలు. తాజాగా న్యూయార్క్‌లో ఉన్న Exl సర్వీస్ అనే ఐటీ సంస్థ తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అవుతోంది.ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. వీరిలో 400 మంది కార్మికులు లేఆఫ్‌లను ఎదుర్కొంటారు.వీరు కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం కంటే తక్కువేనని తెలుస్తోంది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడనుంది. వీరిలో 400మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా..మిగిలిన 400మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం కల్పించనుంది. ఉద్యోగుల కోత ప్రాథమికంగా అమెరికా, భారత్ లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్ లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో EXL, CEOగా ఉన్న రోహిత్ కపూర్ ఇప్పుడు బోర్డు చైర్‌గా పదోన్నతి పొందారు. ఇంకా, వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా,AI ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కంపెనీ ప్రతినిధి ప్రకారం, పునర్నిర్మాణం ప్రస్తుత స్థానాలను తిరిగి అంచనా వేయడం, డేటా, AIలో పరిజ్ఞానం ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జనసేనకు మోగాస్టార్ మద్దతు..పార్టీ కోసం రూ. 5కోట్ల విరాళం..! #it-company #exl-deletion #exl-service #deletions #ai-based-solutions #xl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి