Exit Polls 2024: అవి మోదీ పోల్స్‌.. 295 సీట్లతో అధికారం మాదే: రాహుల్ గాంధీ

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. అవి మోదీ పోల్స్ అని, మోదీజీ ఫాంటసీ పోల్స్ అంటూ కామెంట్స్ చేశారు. 295 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Exit Polls 2024: అవి మోదీ పోల్స్‌.. 295 సీట్లతో అధికారం మాదే: రాహుల్ గాంధీ

ఎగ్జిట్‌ పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎగ్జిట్‌పోల్స్‌ కాదు.. మోదీ పోల్స్‌ అంటూ సెటైర్లు వేశారు. మోదీజీ ఫాంటసీ పోల్స్‌ అంటూ అభివర్ణించారు. ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో మీటింగ్‌ అనంతరం రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. పలు ఎగ్జిట్ పోల్స్ అయితే.. ఎన్డీఏకు ఏకంగా 400కు పైగా సీట్లు రావొచ్చని వెల్లడించాయి. మోదీ హ్యాట్రిక్‌ కొడతారని తేల్చి చెప్పాయి ఈ ఎగ్జిట్‌పోల్స్‌.

ఈ నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీ ఆయా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను కొట్టిపడేశారు. ఎగ్జిట్ పోల్స్ ను కాంగ్రెస్ ఇంతకు ముందుగానే వ్యతిరేకించింది. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా నిన్న పలు టీవీ ఛానళ్లలో నిర్వహించిన చర్చల్లో పాల్గొనొద్దని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే.. ఎగ్జిట్ పోల్స్ ను మోదీ పోల్స్ గా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కూటమికి 295కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సైతం నిన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం, ప్రజల సర్వే ద్వారా తాము ఈ విషయాన్ని చెబుతున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు