CM Revanth Reddy: చేవెళ్ల ఎంపీగా మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి..! కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా ఎవరు బరిలో దిగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏండ్ల తరబడి పార్టీ కోసం కృషి చేసిన వారికే టికెట్ ఇస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డికి సీటు ఇస్తే బాగుంటుందని చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 01 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS CM Revanth Reddy: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా ఎవరు బరిలో దిగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై కసరత్తు సాగుతోంది. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డి తన భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమచారం. Also Read: వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. అదే విదంగా, ప్రస్తుత భాజాపా నాయకుడు చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చి ఎంపీగా పోటి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సన్నిహితులు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వీరిద్దరిని కాంగ్రెస్ లోకి తీసుకురావాడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నించారు కానీ, అప్పుడున్న పరిస్థులలో వారిద్దరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదనే అంచనాతో రేవంత్ రెడ్డికి నో చెప్పారు. రెండు నెలలో అంతా మారిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఇద్దరికి అర్ధమైంది. కాబట్టి కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేయడానికి ఇద్దరు పోటిపడుతున్నట్టు సమాచారం. Also Read: Paytmపై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి? అయితే రేవంత్ మాత్రం, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు తను పిలిచినప్పుడు రానివారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక రావడానికి ప్రయత్నం చేయడమంటే అవకాశవాద రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం అనీ.. ఇటువంటి వారితో పార్టీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం లేదనే భావనతో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం లేనప్పుడు వచ్చుంటే ఉపయోగం ఉండేదెమో కానీ, ఇప్పుడు రావాలనుకోవడమంటే పార్టీ నుండి వారు లాభపొందడం కోసం తప్ప వారి వల్ల పార్టీకి ఎటువంటి లాభం ఉండదని రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేసారని, ఏండ్ల తరబడి పార్టీ కోసం కృషి చేసిన వారికే టికెట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రేవంత్ చేవెళ్ళ పార్లమేంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో అన్నట్టు సమాచారం. అయితే, మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి ఎంపీ సీటు ఇస్తే బాగుంటుందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి