AP CID Delhi Tour : ఏపీ సీఐడీ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ...నెక్ట్స్ ఏం జరగబోతోంది..?

ఏపీ స్కిల్ డెవల్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఈ తరుణంలో శుక్రవారం ఏపీ సీఐడీ టీమ్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

AP CID  Delhi Tour : ఏపీ సీఐడీ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ...నెక్ట్స్ ఏం జరగబోతోంది..?
New Update

ఏపీ స్కిల్ డెవల్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఈ తరుణంలో శుక్రవారం ఏపీ సీఐడీ టీమ్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై టీడీపీ సైతం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నారా లోకేష్ ను అరెస్టు చేస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ చీఫ్ సంజయ్ తోపాటు మరో ఎస్పీ సరిత, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుల్స్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు లీగల్ టీంతో చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే నారా లోకేష్ హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో సీఐడీ మరోసారి ఢిల్లీకి టూర్ పై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నాడు..ఎవరెవర్నీ కలుస్తున్నారన్న దానిపై సీఐడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు అవినీతిని చెప్పే ప్రయత్నాల్లో సీఐడీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడ చదవండి: నవదీప్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ గురించే చర్చ జరుగుతోంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌(AP Skill development scam)లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌పై వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ(ACB) కోర్టులో సీఐడీకి ఫెవర్‌గానే తీర్పు రావడం.. చంద్రబాబు తరుఫు లాయర్లు ఒకదాని తర్వాత మరో పిటిషన్‌ వేయడం.. జస్టిస్‌ హిమబిందు చివాట్లు పెట్టడం అందరికి తెలిసిందే. అటు సీఐడీ చీఫ్‌ సంజయ్‌(CID Chief Sanjay) వరుస పెట్టి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. చంద్రబాబునాయుడు ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడని చెప్పడానికి చాలా ఫ్రూఫ్‌లు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్టీవీ(RTV)తోనూ మాట్లాడారు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు సంజయ్‌.

ప్రచారాలు పట్టించుకోం:
సీఐడీ కళ్ళు మూసుకొని ఉండదంటూ తేల్చిచెప్పారు సంజయ్‌. ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో నారా లోకేశ్‌ పాత్రపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ స్కామ్‌ జరిగిన సమయంలో లోకేశ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారని గుర్తుచేశారు సంజయ్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్‌లో అగ్రిమెంట్‌లో లేని ఒక కొత్త కంపెనీ వచ్చిందని…PVSP గురించి వ్యాఖ్యలు చేశారు సంజయ్. ఎన్నో కంపెనీలకు అక్రమ సొమ్ము వెళ్ళిందన్నారు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. ఫేక్ ఇన్ వాయిస్‌లు జనరేట్ చేసి ఆ డబ్బుల్ని అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడుకి వెళ్లే లాగా చేశారని చెబుతున్నారు సంజయ్. బయట జరుగుతున్న ప్రచారాలను తాము పట్టించుకోబోమని తెలిపారు. చంద్రబాబును కస్టడికి ఇస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.

పెద్ద బోగస్:
స్కిల్ డెవలప్మెంట్ కోపరేషన్ బోగస్ కాదని.. ఈ స్కీమే పెద్ద బోగస్ అని కుండబద్దలు కొట్టినంతా కాన్ఫిడెంట్‌గా కామెంట్స్ చేశారు సంజయ్. ఇదంతా గంట సుబ్బారావు చేశారని.. సిమన్స్‌ కంపెనీకి 58.8 కోట్లు వెళ్ళిందన్నారు. మొత్తం 241 కోట్ల సోమ్ము స్కామ్‌ అని చెప్పారు. తప్పు లేకుండా చంద్రబాబు పీఎస్ అమెరికా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు సంజయ్. ఫేక్ ఇన్ వాయిస్‌లు జనరేట్ చేసిన వ్యక్తి దుబాయ్ పారిపోయాడని.. నిందితులంతా చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర వాళ్లని చెప్పారు. ఆధారాలు లేకపోతే కోర్టు రిమాండ్‌కి ఎందుకు పంపుతుందని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో ప్రభుత్వంలోని పెద్దలే.. డబ్బులు కాజేయడానికి కుట్రపన్నారని తెలిపారు. అసలు అగ్రిమెంటే ఫేక్ అని.. జీవోలో ఏముందో.. అగ్రిమెంట్‌లో ఏముందో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది కదా అని క్వశ్చన్‌ చేశారు సంజయ్. మొత్తం 37 మంది నిందితులు ఉన్నారని చెప్పారు. ఇక ఈ కేసులో మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని చెప్పారు.

#ap-cid #skill-development-scam #ap-cid-delhi-tour
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe