'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌'లోకి రామ్‌చరణ్‌ ఎంట్రీ.. ఏ టీమ్ ను కొన్నాడంటే

నటుడు రామ్ చరణ్ 'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌' కోసం హైదరాబాద్‌ టీమ్ ను కొనుగోలు చేశాడు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ వెంచర్‌ను మొదలుపెట్టానన్నారు.

'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌'లోకి రామ్‌చరణ్‌ ఎంట్రీ.. ఏ టీమ్ ను కొన్నాడంటే
New Update

Ispl-t10 : మెగా హీరో రామ్ చరణ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో తన మార్క్‌ చూపించేందుకు రెడీ అయ్యాడు. ఒకపైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయన పలు రంగాలపైన దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూనే తండ్రికి సపోర్టుగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన బైక్, క్రికెట్ బెట్టింగుల్లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా త్వరలో జరగబోతున్న 'ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌' కోసం హైదరాబాద్‌ టీమ్ ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు చెర్రీ.

ఈ మేరకు ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. క్రికెట్‌కు అతీతంగా, ఈ వెంచర్ ప్రతిభను పెంపొందించాలి. టాలెంట్ తోపాటు సమాజంలో స్ఫూర్తిని నెలకొల్పాలి. గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ వెంచర్‌ను మొదలుపెట్టా' అంటూ ఆదివారం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ టీమ్‌లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం ఓ లింక్‌ను షేర్‌ చేసిన ఆయన.. ఆసక్తి ఉన్న వాళ్లు రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. వర్ధమాన క్రికెట్‌ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్‌ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్‌, ఐఎస్పీఎల్‌ సెలక్షన్‌ కమిటీ హెడ్‌ జతిన్‌ పరాంజపే గతంలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : TSRTC: బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే.. టీఎస్ఆర్టీసీ అదిరే ఆఫర్ మీకోసం!

ఇక ముంబయి జట్టుకు అమితాబ్‌ బచ్చన్‌, బెంగళూరు టీమ్‌కు హృతిక్‌ రోషన్‌, జమ్మూ-కశ్మీర్‌ టీమ్‌కు అక్షయ్‌ కుమార్‌ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీలో నటిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ కథా చిత్రంగా రాబోతున్న మూవీలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా కియారా అద్వాణీ, అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

#ramcharan #indian-street-premier-league #team-hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe