/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tdp-3-jpg.webp)
TDP Devineni Uma house arrest: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ లో ఉన్న వీటీపీఎస్ బూడిద అక్రమ రవాణాను ప్రశ్నించడానికి బయలుదేరారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. జనసేన నేతలతో కలిసి బూడిద అక్రమ రవాణాపై పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, బూడిద చెరువు దగ్గరకు బయలుదేరిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఆ చెరువు దగ్గరకు వెళ్లడానికి పర్మిషన్ లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు ఇంటి ముందే నిరసన చేపట్టారు. బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. వీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని ఆందోళన చేశారు.
Also Read: నందిగామలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాస.!
మాజీ మంత్రి ఉమా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ..మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై ధ్వజమెత్తారు. బూడిద అక్రమరవాణాను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. అక్రమాలు చేసేది మీరైతే..అరెస్ట్ లు చేసేది మమ్మల్నా అంటూ ప్రశ్నించారు.
Also read: అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు: మంత్రి అమర్ నాథ్
అయితే, మరోవైపు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. బూడిద అక్రమ రవాణాపై ప్రశ్నించేందుకు బయలుదేరిన అతడిని అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం..ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 Follow Us
 Follow Us