కాంగ్రెస్ తమ సొంత పార్టీ అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అన్నారు. ఢిల్లీలో ఈ రోజు మల్లిఖార్జున్ ఖర్గేను (Mallikharjun Kharge) కలిసిన తర్వాత ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 2019లో అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా తెలంగాణలో మంచి ప్రభుత్వం రావాలన్న ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి గురించే విమర్శలు చేశానన్నారు. తాను ఇక పర్మినెంట్ గా కాంగ్రెస్ లోనే ఉంటానని వివేక్ స్పష్టం చేశారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి ఉందన్నారు. పార్టీ చెప్పిన చోటు నుంచే పోటీ చేస్తానన్నారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని తనపై నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని చెప్పారు. వివేక్ పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: Babu Mohan: టికెట్ కన్ఫామ్.. పోటీలో ఉన్నట్లా? లేనట్లా? బాబుమోహన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Vivek: ఇక పర్మినెంట్ గా కాంగ్రెస్ లోనే ఉంటా.. అక్కడి నుంచే పోటీ చేస్తా: వివేక్
ఇక తాను పార్టీ మారనని ఇటీవల బీజేపీలో నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజల నుంచి తనపై ఒత్తిడి వస్తుందన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
New Update
Advertisment