AP: లిక్కర్‌లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుండే వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీయాలని రౌడీ డాన్లకు కమాండర్ సజ్జల కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తున్నారన్నారు.

AP: లిక్కర్‌లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!
New Update

Dokka Manikya Vara Prasad: వైసీపీ హయాంలో ఒక్క లిక్కర్ లోనే లక్ష కోట్లు అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జె బ్రాండ్ మద్యం తాగి ఎందరో అనారోగ్య బారిన పడ్డారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేసి, లక్ష కోట్లు రికవరీ చేసి జె బ్రాండ్ బాధితులకు వైద్యం అందించాలన్నారు.

రాష్ట్రంలో తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుండే అరాచకాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీయాలని.. సజ్జల తాడేపల్లి కాంప్లెక్స్ లో రౌడీ డాన్లతో ఇటీవల సమావేశం అయ్యారన్నారు. రౌడీ డాన్లకు కావాల్సిన ఆర్థిక వనరులు కమాండర్ సజ్జల అందజేస్తున్నారని కామెంట్స్ చేశారు.

Also Read: ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

కల్కి కాంప్లెక్స్ కామాండర్ సజ్జల ద్వారానే రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అవుతుందని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలంటే 6 నెలలు సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో వున్నపుడు ఎక్కడైనా శవాలు కనిపిస్తే మీ పనే అనేవారు..ఇప్పుడు ఎక్కడ రౌడీలు కనిపించినా టీడీపీ వాళ్లే అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చెయ్యాలని సజ్జల చూస్తున్నారని.. రాజధాని రైతులకు వార్షిక కౌలు ఐదేళ్లు పెంచడం మంచి పరిణామన్నారు. రాజధాని రైతులు ఊపాధి కోల్పోయారు కాబట్టి కౌలు ఇవ్వడం సమంజసమేనన్నారు. ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం ఒక చారిత్రత్మాక విషయం అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా మంది కృషి చేశారని, మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్ళ నుండి ప్రజా ఉద్యమం చేస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా వున్నపుడు కూడా ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేశారన్నారు.

#dokka-manikya-vara-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe