Malla Reddy: రేవంత్ రెడ్డిని కలుస్తున్నా.. కాంగ్రెస్ లో చేరికపై నా ఆలోచన ఇదే: మల్లారెడ్డి సంచలన ఇంటర్వ్యూ త్వరలో రేవంత్ రెడ్డిని కలిసి ఇటీవల జరిగిన భూ వివాదానికి సంబంధించి తన వద్ద ఉన్న పత్రాలను చూపిస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మల్లారెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 23 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Malla Reddy Interview: కబ్జాలు చేసే అవసరం తనకు లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు తెలంగాణలో ఎవ్వరికీ లేనంత ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఇంత మంచి పేరు ఉన్న తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. బఫర్ జోన్లో కట్టినందుకే తన అల్లుడి కాలేజీలో కూల్చివేతలు చేశారన్నారు మల్లారెడ్డి. అది తప్పు కాదన్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వివాదం జరిగిన ల్యాండ్ 14 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామన్నారు. లక్ష్మణ్ కుమార్ తప్పుడు పత్రాలతో తన భూమిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తరగని ఆస్తి ఉంది.. రాజకీయాల్లోకి రాకముందే తనకు విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. వేయేండ్ల వరకు తరగని ఆస్తి ఉందన్నారు. తనపై ఆసలు ఆరోపణలు లేవనన్నారు. మంచితనంతోనే ఫేమస్ అవుతున్నానన్నారు. తన సమస్యల పరిష్కారం కోసమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశానన్నారు. రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. అధికారంపై తనకు మోజు లేదన్నారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్ లో బీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ సీట్లను సాధించిందన్నారు. ఇక పోటీ చేయను.. మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నాడని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి తొమ్మిదేళ్ల క్రితమే సీఎం అవుతావని చెప్పానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కామ్ కూడా జరగలేదన్నారు. బీఆర్ఎస్ కు 5-8 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. కాలేజీలు నడుపుకుంటూ.. ప్రజా సేవ చేస్తానని చెప్పారు. మల్లారెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి