డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు పోకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అడ్డుకున్నారు.. ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిని చూడకుండా వెంకట రమణా రెడ్డిని అడ్డుకున్నారు.. ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు డీకే అరుణ.
DK Aruna: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. అరెస్టులు అవసరం లేకున్నా.. అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. గురువారం కామారెడ్డిలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటి వరకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు డీకే అరుణ. కాసేపటి క్రితమే బిచ్కుంద పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారని సమాచారం అందిందని, అసలు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు అరుణ.
కామారెడ్డిలో పర్యటన సందర్భంగా.. గజ్వేల్ మాదిరిగానే కామారెడ్డి కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన డీకే అరుణ.. ఇదే విషయమై పరిశీలించేందుకు వెంకటరమణ రెడ్డి గజ్వేల్‌కు వెళ్లారన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్లిన వెంకట రమణ రెడ్డిని పోలీసులు నిరంకుశంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు డీకే అరుణ. గజ్వేల్‌ను నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే.. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు బీజేపీ నాయకురాలు. అభివృద్ధి లేకే భయపడ్డారని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ భూములన్నింటినీ వెంచర్లు మార్చిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని అన్నారు.
ఇలాంటి విధానాలతో తెలంగాణలో రానున్న రోజుల్లో వ్యవసాయం ఉంటుందా? అని ప్రశ్నించారు డీకే అరుణ. 'డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు పోకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అడ్డుకున్నారు.. ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిని చూడకుండా వెంకట రమణా రెడ్డిని అడ్డుకున్నారు.. ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడేది లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరించాలని ప్రయత్నిస్తే బీజేపీ భయపడదని అన్నారామె. వెంటనే వెంకటరమణా రెడ్డిని విడుదల చేసి.. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ఏమీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కాదని వ్యాఖ్యానించారు.
పోలీసులపై ఫైర్..
ఇదే సమయంలో పోలీసుల అనుసరిస్తున్న తీరుపైన తీవ్రంగా మండిపడ్డారు డీకే అరుణ. పింక్ కండువాలు కప్పుకున్న కార్యకర్తలుగా కొందరు పోలీసులు మారారని విమర్శించారు. కేసిఆర్ ఏం చేసినా జీ హుజూర్ అనాలే తప్ప.. ప్రశ్నించొద్దని, అలా ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారామె. ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పటిలా చేసి ఉంటే.. నేడు తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు డీకే అరుణ. తెలంగాణను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ పాలించే హక్కు లేదన్నట్లు చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
LIVE :BJP National Vice-President Smt DK Aruna Press Meet || BJP Telangana https://t.co/mb57eerKFd
రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని డీకే అరుణ అన్నారు. బీజేపీపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్న పోలీసుల పేర్లు బీజేపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చిన ఆమె.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారి సంగతి చూద్దామంటూ కార్యకర్తలనుద్దేశించి సంచలన కామెంట్స్ చేశారామె. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూద్దామని అని అన్నారు. పోలీసులతోనే గత ఎన్నికల్లో గెలిచామని.. ఈసారి కూడా గెలుస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్కబెడుతున్నారని అన్నారు.
DK Aruna: 'వచ్చేది మన ప్రభుత్వమే.. చూసుకుందాం'.. బీఆర్ఎస్ సర్కార్‌పై డీకే అరుణ సంచలన కామెంట్స్..

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని డీకే అరుణ అన్నారు. బీజేపీపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్న పోలీసుల పేర్లు బీజేపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చిన ఆమె.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారి సంగతి చూద్దామంటూ కార్యకర్తలనుద్దేశించి సంచలన కామెంట్స్ చేశారామె. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూద్దామని అని అన్నారు. పోలీసులతోనే గత ఎన్నికల్లో గెలిచామని.. ఈసారి కూడా గెలుస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్కబెడుతున్నారని అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే నేనే అంటున్న డీకే అరుణ
Also Read: Raja Singh: ఆయన ఒక రబ్బర్ స్టాంప్.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు