పొలిటికల్ సెన్సేషనల్, సీఎం జగన్‌ని కలిసిన ఆనం సోదరులు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటివరకు ఆనం జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణి ఆనం ఆ రుణమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపుకు వెళ్ళిపోయారు. By Shareef Pasha 04 Jul 2023 in నెల్లూరు Scrolling New Update షేర్ చేయండి ఇటీవల జిల్లాలో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆనం రామనారాయణ రెడ్డి వర్గం యాక్టివ్ గా కనిపించింది. ఆనం రామనారాయణ రెడ్డి వైపు దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డితో ఆనం జయకుమార్ రెడ్డి కలిసి సీఎంను కలవడంతో ఆనం వర్గంలో భారీ చీలిక ఏర్పడనుంది. గత కొంతకాలంగా ఆనం జయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇనాక్టివ్ గా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాక తాజాగా ఆనం జయ ,విజయ కలిసి సీఎంను కలవడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి ప్రభావం నెల్లూరు సిటీ రూరల్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆనం కుటుంబంలో కొందరు తెలుగుదేశం వైపు మరికొందరు వైసీపీ వైపు ఉన్నారు. ఆనం వివేకానంద రెడ్డి పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి ఇంకా ఊగిసలాటలోనే కొనసాగుతున్నారు. మొత్తం మీద ఆనం విజయ్ కుమార్ రెడ్డి జై కుమార్ రెడ్డి కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడంతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. ఓ వైపు మాజీ మంత్రి ఆనం నారాయణరెడ్డి కి వైసీపీ చెక్ పెట్టినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అన్నదమ్ముల చర్చలు కొనసాగుతున్నాయి. వీరిని పార్టీలో ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి