/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bengalure.jpg)
కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సాఫ్ వేర్ కంపెనీకి చెందిన ఏండీ, సీఈవోను దారుణంగా హత్య చేశాడు అదే కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి. సంవత్సరం క్రితం స్థాపించిన ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ ఎండీ, సీఈవోలను మాజీ ఉద్యోగి హత్య చేయడం కలకలం రేపింది.
నిందితుడు కార్యాలయంలోకి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో వినుకుమార్ అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఫెలిక్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీసీపీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. అయితే ఫెలిక్స్ కూడా ఇలాంటి బిజినెస్ ఉందని పోలీసులు వెల్లడించారు. తన వ్యాపారం విషయంలో వీరిద్దరు జోక్యం చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గతంలో ఇలాంటి తరహా హత్యనే అమెరికాలో కూడా జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ట్రాన్స్ పోర్ట్, ఫుడ్ డెలివరీ సేవలు అందించే సంస్థ సీఈవో దారుణ హత్యకు గురయ్యాడు. తన ఫ్లాట్ లోనే గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని చంపేశారు. శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. ఫాహిమ్ బంగ్లాదేశ్ కు చెందిన వ్యాపారవేత్తగా గుర్తించారు. తన సోదరి ఫ్లాట్ కు వచ్చేసరికి దుండగులు హత్య చేసి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఇదే తరహా హత్య బెంగళూరులో చోటుచేసుకోవడం కలకలం రేపింది.