BREAKING: పాక్ ISIతో సంబంధాలు.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు!

పాక్ ISIతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌ కేసులో నాగపూర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బ్రహ్మోస్ క్షిపణికి రహస్య సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వెల్లడించినట్లు 2018లో పట్టుబడిన అగర్వాల్ కు జీవిత ఖైదు విధించింది.

New Update
BREAKING: పాక్ ISIతో సంబంధాలు.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్ కు జీవిత ఖైదు!

BREAKING: పాక్ ISIతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌ కేసులో నాగపూర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వెల్లడించినట్లు 2018లో పట్టుబడిన అగర్వాల్ కు జీవిత ఖైదు విధించింది.

ఈ మేరకు 2018 కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను ప్రభావితం చేసిన మొదటి గూఢచారిగా అగర్వాల్ ను గుర్తించింది. అగర్వాల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో ఇస్లామాబాద్ నుంచి నిర్వహించబడుతున్న రెండు ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ నేహా, శర్మ-పూజా రంజన్‌ల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కార్యకర్తలతో కమ్యూనికేట్ చేసినట్లు నివేదించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుండి యంగ్ సైంటిస్ట్స్ అవార్డు గ్రహీత అయిన నిశాంత్ అగర్వాల్.. ఇలాంటి కార్యకలాపాల్లో తన ప్రమేయం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయరని తెలిపింది. అయితే అతను అత్యంత సున్నితమైన పనిలో పాల్గొనగా ఇంటర్నెట్‌లో అగర్వాల్ అలసత్వ వైఖరి సులభంగా అతన్ని పట్టించినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతిభావంతులైన ఇంజనీర్‌గా గుర్తింపు పొందిన అగర్వాల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్రలో చదువుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు