Lok Sabha Elections: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కాగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్ లో గందరగోళం పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు. దీంతో కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections: EVM, VVPATను చెరువులో పడేశారు!
పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు. దీంతో కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు.
New Update
Advertisment