European Cricket Match: ఇది మామూలు ఊచకోత కాదయ్యా! 43 బంతుల్లో 193 పరుగులు..

క్రికెట్ అంటేనే సంచలనాలకు కేరాఫ్. తాజాగా యూరోపియన్ టీ10 లీగ్ మ్యాచ్‌లో కాటలున్యా జాగ్వార్ టీమ్‌ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయాడు. కేవలం 43 బంతుల్లో 22 సిక్సర్లు, 14 ఫోర్లతో 193 పరుగులు చేశాడు హంజా సలీమ్ దార్.

European Cricket Match: ఇది మామూలు ఊచకోత కాదయ్యా! 43 బంతుల్లో 193 పరుగులు..
New Update

European Cricket Match: పరుగుల వరద అంటే టీ20 అంటారు. కానీ.. అంతకు మించి సర్‌ప్రైజ్ ఇస్తున్నాయి టీ10 మ్యాచెస్. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు ప్లేయర్స్. తాజాగా హంజా సలీమ్ దార్ కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ మ్యాచ్‌లో భాగంగా కాటలున్యా జాగ్వార్, సోహాల్ హాస్పిటల్‌టెట్ టీమ్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హంజా కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేసి క్రికెట్ ప్రేక్షకులను ఫుల్ కిక్ ఇచ్చాడు. 22 సిక్సర్లు, 14 ఫోర్లతో విరుచుకుపడ్డాడు హంజా. టీ10 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డులకెక్కింది. అంతకు ముందు 163 పరుగుల రికార్డ్ ఉండేది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కాటలున్యా జాగ్వార్ 10 ఓవర్లలో మొత్తం 257/0 పరుగులు చేసింది. జాగ్వార్స్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన హంజా కేవలం 43 బంతుల్లో 193* పరుగులు చేశాడు. అతిన అపోనెంట్ యాసిర్ అలీ కేవలం 19 బంతుల్లో 58* పరుగులు చేశాడు. మొత్తంగా జాగ్వార్ టీమ్ ఒక్క వికెట్ కోల్పోకుండానే.. నిర్ణీత 10 ఓవర్లలో 257 పరుగుల చేసి క్రికెట్ చరిత్రలోనే సంచలనం క్రియేట్ చేసింది. బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ హంజా రెచ్చిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. ఫైసల్ సర్ఫరాజ్, ఫరూఖ్ సొహైల్, అమీర్ హమ్జా, ఎండి ఉమర్ వకాస్ తలో వికెట్ తీశారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కాటలున్యా జాగ్వార్ ఘన విజయం సాధించింది.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

#cricket #european-cricket-match #hamza-saleem-dar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe