Euro 2024 : స్కాట్‌లాండ్‌ పై జర్మనీ ఘన విజయం.. మిగిలిన టీమ్స్ కు హెచ్చరిక. 

యూరో కప్ 2024 కర్టెన్ రైజర్ మ్యాచ్ లో జర్మనీ ఘనవిజయం సాధించింది. స్కాట్‌లాండ్‌ టీం పై 5-1 తేడాతో విజయం సాధించడం ద్వారా టోర్నీలో మిగిలిన జట్లకు గట్టి హెచ్చరిక పంపించింది. ఈ టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్న జర్మనీ ధాటికి స్కాట్‌లాండ్‌ అసలు జవాబు ఇవ్వలేకపోయింది 

New Update
Euro 2024 : స్కాట్‌లాండ్‌ పై జర్మనీ ఘన విజయం.. మిగిలిన టీమ్స్ కు హెచ్చరిక. 

Euro Cup 2024 : యూరో కప్ 2024లో భాగంగా శుక్రవారం జరిగిన కర్టెన్ రైజర్ మ్యాచ్ లో జర్మనీ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఇతర జట్లకు గట్టి హెచ్చరిక పంపించింది. మ్యూనిచ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో స్కాట్‌లాండ్‌ (Scotland) ను 5-1 తేడాతో ఓడించి టోర్నీకి తన సంసిద్ధతను వెల్లడించింది. జర్మనీ జట్టులోని జమాల్ ముసియాలా, నిక్లాస్ ఫుల్‌క్రూగ్,  టోని క్రూస్ ఆ రోజున అత్యుత్తమ ఆటగాళ్ళుగా నిలిచారు.  ఆతిథ్య జట్టు తమ టోర్నమెంట్‌ను స్టైల్‌గా ప్రారంభించింది. మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి స్కోరింగ్ తెరిచాడు .  అక్కడ నుండి జర్మనీ విశ్వరూపం కనిపించింది.  జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ తొలి అర్ధభాగంలోనే స్కోర్ చేయడంతో ప్రథమార్థంలోనే స్కాట్లాండ్ కష్టాలు మరింత పెరిగాయి.

Euro 2024 : స్కాట్‌లాండ్‌ ఆటగాళ్లు మొదటి అర్ధభాగంలో రెడ్ కార్డ్ బారిన పడ్డారు.  తర్వాత జర్మనీ ఆటగాళ్లు నిక్లాస్ ఫుల్‌క్రుగ్, ఎమ్రే కెన్ నుండి 2 గోల్స్‌ను సాధించారు. దీంతో స్కాట్‌లాండ్‌ను 5-1 తేడాతో ఓడించగలిగారు. 

జర్మనీ VS స్కాట్లాండ్ ఆట ఇలా..
Euro 2024 జర్మనీకి చెందిన ఫ్లోరియన్ విర్ట్జ్ (Florian Virtz) 10వ నిమిషంలో స్కోరింగ్‌ను ప్రారంభించాడు. అతను ఒక క్రాస్‌తో కనెక్ట్ అయ్యాడు.  గోల్ కీపర్ అంగస్ గన్ ని దాటుకుంటూ నెట్ లోకి పోయింది. 

మూడుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌ (European Champions) లు మ్యూనిచ్ ఫుట్‌బాల్ అరేనాలో 19వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు.  కై హావర్ట్జ్,  జమాల్ ముసియాలా స్కాట్‌లాండ్‌ వైపు దాడులు చేసి వరుస గోల్స్ సాధించడంతో పైచేయి సాధించింది జర్మనీ. సరిగ్గా ఇదే సమయంలో 

Euro 2024: పెనాల్టీ ఏరియాలో ఫౌల్ చేసినందుకు ఇల్కే గుండోగన్‌ను  పోర్టియస్ బయటకు పంపించారు. దీంతో స్కాట్‌లాండ్‌కు పరిస్థితి  చాలా ఘోరంగా మారింది.  సెకండ్ హాఫ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడు నిక్లాస్ ఫ్యూల్‌క్రుగ్ నాల్గవ గోల్‌ చేయడంతో జర్మనీ మరింత ముందుకు దూసుకుపోయింది. ఆ తరువాత స్కాట్లాండ్ కి చెందిన  ఆంటోనియో రూడిగర్ గోల్ చేయడంతో   స్కోర్‌షీట్‌లోకి చేరుకుంది.  ఆతిథ్య జర్మనీ (Germany) జట్టు కోసం చివరిలో ఎమ్రే కెన్ సూపర్ గోల్ చేయడం ద్వారా తన స్కోరింగ్ పూర్తి చేసింది. 

జర్మనీ తర్వాత గ్రూప్ Aలో హంగేరీతో ఆడుతుంది.  స్విట్జర్లాండ్‌తో తలపడేందుకు స్కాట్లాండ్ సిద్ధం కావలసి ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు