ఈటలను చిత్తు చిత్తుగా ఓడిస్తా.. RTVతో పాడి కౌశిక్ ఇంటర్వ్యూ

ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ హుజురాబాద్ ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ వైపే మొగ్గుచూపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

New Update
ఈటలను చిత్తు చిత్తుగా ఓడిస్తా.. RTVతో పాడి కౌశిక్ ఇంటర్వ్యూ

Rajender Vs Kaushik: హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. హుజురాబాద్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై బిఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఆర్టీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ఈసారి ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తమ విజయానికి తొలి మెట్టు అని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్, దళిత బంధు, రైతు రుణమాఫీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీరు, పెన్షన్‌ను అందించడం గాని ఇలా ఎన్నో అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఎంతగానో లబ్ది చేకూరిందని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ బొమ్మ ఉంటే చాలని అన్నారు. ప్రజలు ఎమోషన్ తోనే 2021లో ఈటల రాజేందర్ గెలిచారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ అభివృద్ధి వైపే ఉన్నారని పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.

Also Read: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు